అంగన్‌వాడీల ద్వారా సమగ్ర సేవలు అందాలి – జిల్లాలో SAM, MAM పిల్లలు ఉండకూడదు: జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి

అంగన్‌వాడీలను మోడల్ కేంద్రాలుగా మార్చాలి SAM, MAM పిల్లలు లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ బాలికల భవిష్యత్తే లక్ష్యం: మహిళా శిశు సంక్షేమంపై కలెక్టర్ స్పష్టత పత్తికొండ ,జనవరి 28 (స్ఫూర్తి పత్రిక): అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు, పిల్లలకు సమగ్రమైన సేవలు అందించాలని, జిల్లాలో ఎక్కడా సామ్ (SAM), మామ్ (MAM) ఉన్న పిల్లలు ఉండకుండా అధికారులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. బుధవారం పత్తికొండ ఎం కన్వెన్షన్ హాల్‌లో పత్తికొండ డివిజన్ సిడిపిఓలు, అంగన్‌వాడీ సూపర్వైజర్లు,...