ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా రాముడు – జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు
దేవనకొండ గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రాముడు ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి చేతుల మీదుగా ఆయన అవార్డు మరియు ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. మండల పరిధిలోని నేలతలమరి గ్రామానికి చెందిన రాముడు ప్రస్తుతం దేవనకొండ, నల్లచెలిమెల గ్రామపంచాయతీల కార్యదర్శిగా, అలాగే ఇన్‌చార్జి డిప్యూటీ ఎంపీడీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంకితభావంతో, సేవా దృక్పథంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించడం ద్వారా మంచి పేరు సంపాదించారు. గ్రామ సచివాలయాల్లో ప్రజలకు మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య...