ఎమ్మిగనూరు జిల్లా కోసం 23వ రోజు కొనసాగిన నిరాహార దీక్షలు

దీక్ష శిబిరంలోనే గణతంత్ర దినోత్సవం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లుతెరవాలి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై ఆగ్రహం  ఎమ్మిగనూరు ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మిగనూరు ప్రధాన కూడలిలో చేపట్టిన నిరాహార దీక్షలు 23వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు దీక్ష శిబిరంలోనే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు.ముందుగా బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం దీక్షలను కొనసాగించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ, పండుగలను కూడా కుటుంబాలకు దూరంగా గడుపుతూ 23 రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం...