ఐపీఎల్ మోజు వెనుక సైబర్ మోసాల ఉచ్చు… అప్రమత్తతే ప్రజలకు రక్షాకవచం
- నష్టం జరిగిన వెంటనే 1930కు కాల్ చేయాలని సూచన - ఐపీఎల్ పేరిట పెరుగుతున్న ఆన్లైన్ మోసాల పంజా - తక్షణ లాభాల ఆశతో మోసాలకు గురవుతున్న ప్రజలు - బ్యాంక్ వివరాల దుర్వినియోగంపై పోలీసుల హెచ్చరిక దేవనకొండ, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా మరింత పద్ధతిసిద్ధంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ పోటీల సమయంలో ఆన్లైన్ వేదికలను వినియోగిస్తూ జరుగుతున్న మోసాలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తక్కువ సమయంలో అధిక లాభాలు...