కురుకుందలో నీటి సమస్యపై ఎమ్మెల్యే విరుపాక్షి జోక్యం… కలెక్టర్‌కు వినతి

– చాలా రోజులుగా కొనసాగుతున్న తాగునీటి ఇబ్బందులు– హెబ్బటం నుంచి పైపులైన్ ప్రతిపాదన, ₹59 లక్షల నిధుల– సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే– సానుకూలంగా స్పందించిన కలెక్టర్ హోళగుంద, మార్చి 17 (స్ఫూర్తి పత్రిక): ఆలూరు నియోజకవర్గ పరిధిలోని కురుకుంద గ్రామంలో తాగునీటి సమస్య చాలా కాలంగా కొనసాగుతూ గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. రోజువారీ అవసరాలకు సరిపడా నీరు అందక ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్న పరిస్థితి నెలకొంది. గ్రామంలో తాగునీటి కొరత కారణంగా మహిళలు దూర ప్రాంతాలకు వెళ్లి నీరు...