పెద్దహ్యట గ్రామంలో చెత్త బుట్టల పంపిణీ
తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా వేయాలని సూచనలు
పంచాయతీ కార్యదర్శి నాగరాజు, యువ నాయకుడు బి.కే. వీరేష్ పిలుపు
గ్రామ పరిశుభ్రతకు ప్రజల సహకారం అవసరం
హోళగుంద, మార్చి 11 (స్ఫూర్తి పత్రిక):
గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యానికి ఎంతో అవసరమని పెద్దహ్యట గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు, టిడిపి యువ నాయకుడు బి.కే. వీరేష్ పేర్కొన్నారు.
గ్రామంలో పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు చెత్త సేకరణ బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరుగా వేయాలని సూచించారు. గ్రామంలో అందించిన చెత్త బుట్టల్లో చెత్తను వేసి, పంచాయతీ చెత్త సేకరణ వాహనానికి అప్పగించాలని తెలిపారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అనేక రకాల వ్యాధులను నివారించవచ్చని, గ్రామ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలని సూచించారు. గ్రామపంచాయతీ చేపడుతున్న పరిశుభ్రత కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా దాదాపు 200 చెత్త బుట్టలను గ్రామ ప్రజలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. పరిశుభ్రమైన గ్రామం నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రాము, కురువ అడివప్ప, కృష్ణ, ఎల్లప్ప, టిడిపి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

