చెత్త కుప్పల మధ్య జీవనం… దేవనకొండలో పరిశుభ్రతపై ప్రశ్నలు

– వ్యర్థాలు పేరుకుపోయి నిల్వ నీరు– 15 రోజులుగా పరిష్కారం కాని సమస్య– అంటు వ్యాధుల భయంతో కాలనీ ప్రజల వాపోరు దేవనకొండ, మార్చి 17 (స్ఫూర్తి పత్రిక): మండల కేంద్రంలోని మాలవీధి సమీపంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి నిల్వ నీరు ఉండటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. స్థానికంగా జెడ్పీటీసీ ఇంటి వెనుక భాగంలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోందని వారు పేర్కొన్నారు. సుమారు పదిహేను రోజులుగా చెత్త తొలగింపు సక్రమంగా జరగకపోవడంతో అక్కడ మురికి నీరు నిల్వ ఉండి...