శిరివెళ్ళ మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ ఐ. విజయశ్రీ జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం మాట్లాడిన తహసిల్దార్, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ శుభదినం ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలలోనే భారత రాజ్యాంగం అత్యంత శక్తివంతమైనదిగా నిలిచిందని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి జీవన విధానాన్ని కొనసాగించాలని సూచించారు.స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం, సౌబ్రాతృత్వం వంటి విలువలను భారత రాజ్యాంగం దేశ పౌరులకు అందించిందని, ఇది ప్రతి పౌరునికి దిక్సూచి లాంటిదని ఆమె అన్నారు. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ హక్కులు పొందుపరిచినట్లే బాధ్యతలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ కిషోర్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర కుమార్, ఆయా గ్రామాల రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
0
39

