sphoortipatrika.com
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 12:27 pm Digital Edition : SPHOORTI PATRIKA

తాగునీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారం

– వైకుంఠం జ్యోతి సూచనల మేరకు చర్యలు
– బి.జి. హళ్లి గ్రామంలో 15 రోజులుగా నీటి కొరత
– ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా

హోళగుంద, మార్చి 14 (స్ఫూర్తి పత్రిక):

హోళగుంద మండలం చిన్నహ్యాట పంచాయతీ పరిధిలోని బి.జి. హళ్లి గ్రామంలో త్రాగునీరు సరఫరా చేసే మోటారు చెడిపోవడంతో గత 15 రోజులుగా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సమస్యతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సమస్యపై స్థానిక నాయకులు స్పందించారు.ఈ విషయాన్ని తెలుసుకున్న ఆలూరు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి గ్రామానికి వెంటనే త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమె సూచనల మేరకు గ్రామ టిడిపి నాయకులు మరియు క్లస్టర్ ఇంచార్జ్ వీరేంద్ర ట్యాంకర్ల ద్వారా గ్రామానికి త్రాగునీటిని సరఫరా చేశారు.దీర్ఘకాలంగా నీటి కోసం ఇబ్బంది పడుతున్న తమ సమస్యను గుర్తించి తక్షణమే నీరు అందించినందుకు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై స్పందించి త్రాగునీరు అందించినందుకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామస్థులు ఆలూరు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి, క్లస్టర్ ఇంచార్జ్ వీరేంద్రలకు ధన్యవాదాలు తెలిపారు.