తుంగభద్ర జలాలతో హోళగుందకు జీవం… అన్నదాతల్లో హర్షం
ఎల్‌ఎల్‌సీ కాలువ ద్వారా నీటి ప్రవాహం ప్రారంభం గంగమ్మ పూజలతో రైతుల ఆనందోత్సాహం సాగు, తాగునీటి సమస్యలకు ఉపశమనం ఆశలు వేసవిలో నీటి లభ్యతపై ప్రజల్లో సంతృప్తి హోళగుంద, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): తుంగభద్ర దిగువ ప్రధాన కాలువ (ఎల్‌ఎల్‌సీ) ద్వారా విడుదలైన నీరు సోమవారం హోళగుంద మండలానికి చేరుకోవడంతో రైతులు, స్థానిక ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎండల తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో కాలువకు నీరు రావడం ప్రాంత ప్రజలకు ఊరటనిచ్చిన పరిణామంగా మారింది.కాలువ వద్ద నీరు చేరిన సందర్భంగా గ్రామస్తులు,...