దేవనకొండ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ లేమి – గర్భిణీల ప్రాణాలపై ప్రమాద ఘంటికలు!

- 40కి పైగా గ్రామాలకు ఒకే ఆధారం… కీలక సేవలు నిలిచిపోయిన పరిస్థితి - గర్భిణీల పరీక్షలు ఆలస్యం… పేదలు ప్రైవేట్ వైపు నెట్టబడుతున్న దుస్థితి - స్థానిక వైద్యుల విజ్ఞప్తులు ఫలించకపోవడం… అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన - తక్షణ నియామకం లేకపోతే ప్రమాదాలు పెరిగే అవకాశమని నిపుణుల హెచ్చరిక దేవనకొండ, ఏప్రిల్ 12 (స్ఫూర్తి పత్రిక): దేవనకొండ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి, పరిసర ప్రాంతాల్లోని దాదాపు 40 గ్రామాల ప్రజలకు ప్రధాన వైద్య కేంద్రంగా కొనసాగుతోంది. పేదలు, గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో...