sphoortipatrika.com
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 11:41 am Digital Edition : SPHOORTI PATRIKA

దేవనకొండ ఎఫ్‌.ఆర్‌. హై స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

 దేవనకొండ మండల కేంద్రమైన ఎఫ్‌.ఆర్‌. హై స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పీ. రఘునాథ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం నిర్వహించిన రిపబ్లిక్ డే దినోత్సవ సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉచ్చిరప్ప అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఈ వేడుకల్లో విశ్రాంత ఉపాధ్యాయులు ఏ. ఉచ్చిరప్ప, వై. రంగస్వామి, రవీంద్రనాథ్ పాటిల్, లాయర్ రమేష్, అలారుదిన్నె సర్పంచ్ రామానాయుడు, టీడీపీ నాయకులు శాంతికుమార్, మాజీ ఎంపీటీసీ సభ్యులు రాముడు, డీలర్ బండ్లయ్య, మాజీ ఉప సర్పంచ్ కౌలుట్లయ్య, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.