దేవరగట్టులో భక్తుల రద్దీ… మాళ మల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

– ఆదివారం సందర్భంగా ఘనంగా అభిషేకాలు, అర్చనలు– ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు– ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం– భక్తులకు అన్నదాన కార్యక్రమం హోళగుంద, మార్చి 15 (స్ఫూర్తి పత్రిక): హోళగుంద మండల పరిధిలో ప్రసిద్ధిగాంచిన దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు గిరి స్వామి,...