📄 ePaper
Wednesday, March 18, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో దేవనకొండలో భారీ ర్యాలీ ,బహిరంగ సభ…

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో దేవనకొండలో భారీ ర్యాలీ ,బహిరంగ సభ…

📰 Generate e-Paper Clip

కార్మికుల పొట్ట కొట్టి కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్న ప్రభుత్వాలు.

దేవనకొండ, ఫిబ్రవరి,(స్ఫూర్తి పత్రిక) కార్మిక, రైతు, కూలీల ప్రయోజనాలను పణంగా పెట్టి కార్పొరేట్ సంస్థలకు లాభాలు పెంచడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కష్టపడుతున్నాయని పేదలను కొట్టి పెద్దలకు విందు భోజనం పెడుతున్నారని, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే.మద్దిలేటి శెట్టి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి. వీరశేఖర్ లు పేర్కొన్నారు.గురువారం దేశవ్యాప్తంగా దుర్మార్గమైన లేబర్ కోడ్ల రద్దు, గ్రామీణ ఉపాధి హామీ పథకం కాపాడుకునేందుకు, కనీస వేతనాలు, రైతుల గిట్టుబాటు ధరలపై, కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేవనకొండ మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్ నుండి బస్టాండ్ వరకు కార్మికులు, కూలీలు, రైతులు, స్కీమ్ వర్కర్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కార్మిక ,రైతుల వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.స్థానిక బస్టాండులో కార్మిక సంఘం నాయకులు నరసారావు, అశోక్ ల అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా, శ్రమశక్తిని, ప్రజా సంపదను కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతున్నాయని అన్నారు. మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతీయం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టి ప్రజా సమస్యలను పక్కదో పట్టిస్తున్నాయని ఆరోపించారు. అవకాశవాద ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలకు అందరూ సిద్ధం కావాలని పేర్కొన్నారు. లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకొని రావడం వల్ల కార్మికుల హక్కులకు భంగం వాటిల్లుతుందని, సమ్మె చేసే హక్కు, వేతనాలు పెంచాలని, భేరసారాల హక్కు, సంఘం ఏర్పాటు చేసుకునే హక్కు, పనిగంటలు ఎనిమిది నుండి 12 గంటలకు పెంచడం పై, ఉద్యోగ భద్రత లేకుండా కార్మికులకు హక్కులు లేకుండా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉండే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పజెప్పే ప్రయత్నం ఆపాలని డిమాండ్ చేశారు.స్కీం వర్కర్లైన ఆశ, అంగన్వాడీ, గ్రామపంచాయతీ లలో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నారు. అసంఘటితరంగా కార్మికులైన ఆటో, హమాలీ, స్ట్రీట్ వెండర్స్, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీల లకు సమగ్ర కార్మిక సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై ఉద్యమ తీవ్రతను తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు, వ్యవసాయ కూలీలు, కార్మిక, రైతు, యువజన , విద్యార్థి సంఘాల నాయకులు మాధవ కృష్ణ, మహబూబ్ బాషా, బజారి, కండప్ప ,రాజశేఖర్, కృష్ణ, భాస్కర్, బడే సాహెబ్, కెపి రాముడు సుధాకర్ రవీంద్ర, మహీంద్రా, నాగేంద్ర, రాజన్న, బలరాముడు, సూరి ,అనిల్, నాగరాజు , జ్యోతిలక్ష్మి, మాభూన్నీ,లక్ష్మీదేవి సరోజ మంగమ్మ, విజయలక్ష్మి, తులసి, రాధా, మీనా, వెంకటలక్ష్మి,యూసుఫ్, వీరేంద్ర, ,కృష్ణ, భాస్కర్, దుబ్బన్న, నరేష్, రాముడు, భాష తదితరులు పాల్గొన్నారు.

సమ్మెలో పాల్గొన్న వామపక్ష సంఘాలు
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!