నిర్మాణ కార్మికుల నిరసన – తహసీల్దార్‌కు వినతి

వెల్ఫేర్ బోర్డులు పటిష్టం చేయాలని డిమాండ్ పెండింగ్ 46 వేల క్లెయిములు వెంటనే పరిష్కరించాలి సెస్సు 2%కి పెంపు – నేరుగా బోర్డు ఖాతాకు జమ చేయాలి దేవనకొండ, ఫిబ్రవరి 23 (స్ఫూర్తి పత్రిక): దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 23న నిర్వహించిన నిరసన దినంలో భాగంగా దేవనకొండలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబంధించి మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్ ఆమోదించిన 1996 భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం అమలులో రాష్ట్రాల మధ్య ఏకరీతి లేకపోవడం...