నేరనికి తాండలో రక్తపాతం… గొడ్డలితో దాడి …రాము నాయక్ పరిస్థితి విషమం

వ్యక్తిగత వివాదం ఘర్షణకు దారి విచక్షణారహిత దాడితో తీవ్ర గాయాలు నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు హోళగుంద, మార్చి 31 (స్ఫూర్తి పత్రిక): కర్నూలు జిల్లా హోళగుంద మండలంలోని నేరనికి తాండ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వ్యక్తిగత వివాదం ఘర్షణకు దారి తీసి, ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది.గ్రామానికి చెందిన రాము నాయక్‌పై అదే గ్రామానికి చెందిన రాఘవేంద్ర నాయక్ విచక్షణారహితంగా గొడ్డలితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో...