పండుగ రోజునా దాహంతోనే గ్రామాలు… చిన్నయట, బీజేహళ్లిలో నీటి సంక్షోభం విపరీతం
15 రోజులుగా తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడం కిలోమీటర్ల దూరం నడిచి నీరు తెచ్చుకుంటున్న మహిళలు బోర్ల వద్ద నిరాకరణతో ఉద్రిక్తతలు అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల తీవ్ర ఆగ్రహం హోళగుంద, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): హోళగుంద మండల పరిధిలోని చిన్నయట, బీజేహళ్లి గ్రామాలు ప్రస్తుతం తీవ్ర తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గత పదిహేను రోజులుగా గ్రామాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజల దైనందిన జీవితం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా వేసవి తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో నీటి కొరత మరింత తీవ్రమై,...