పండుగ వేళ గ్యాస్ సంక్షోభం… వినియోగదారుల ఆవేదన

– రంజాన్ సీజన్‌లో సిలిండర్ల కొరత తీవ్రం– బుకింగ్ చేసినా రోజులు గడిచినా డెలివరీ లేదు– అధికారుల నిర్లక్ష్యంపై వినియోగదారుల అసంతృప్తి హోళగుంద, మార్చి 17 (స్ఫూర్తి పత్రిక): పవిత్ర రంజాన్ పండుగ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో హోళగుంద మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రరూపం దాల్చింది. వంటలకు అత్యవసరమైన గ్యాస్ సకాలంలో అందకపోవడంతో సామాన్య వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ బుక్ చేసిన వినియోగదారులకు రోజులు గడిచినా సిలిండర్లు డెలివరీ కాకపోవడం వల్ల ఆందోళన నెలకొంది. కొంతమంది వినియోగదారులు గ్యాస్...