పత్తికొండలో బీజేపీ మోర్చాలకు కొత్త మండల అధ్యక్షుల నియామకం

ఓబీసీ, కిసాన్, ఎస్టీ మోర్చాలకు కొత్త నాయకత్వం పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నూతన నాయకుల హామీ పత్తికొండ, మార్చి 22 (స్ఫూర్తి పత్రిక): పత్తికొండ మండలంలో భారతీయ జనతా పార్టీ వివిధ మోర్చాలకు కొత్త మండల అధ్యక్షులను నియమించారు. ఈ సందర్భంగా పత్తికొండ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు నూతనంగా ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేశారు. పత్తికొండ అసెంబ్లీ కో-కన్వీనర్ గోవర్ధన్ నాయుడు, మండల అధ్యక్షుడు కరణం నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా...