sphoortipatrika.com
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 1:23 pm Digital Edition : SPHOORTI PATRIKA

పత్తికొండలో బీజేపీ మోర్చాలకు కొత్త మండల అధ్యక్షుల నియామకం

  • ఓబీసీ, కిసాన్, ఎస్టీ మోర్చాలకు కొత్త నాయకత్వం
  • పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నూతన నాయకుల హామీ

పత్తికొండ, మార్చి 22 (స్ఫూర్తి పత్రిక):

పత్తికొండ మండలంలో భారతీయ జనతా పార్టీ వివిధ మోర్చాలకు కొత్త మండల అధ్యక్షులను నియమించారు. ఈ సందర్భంగా పత్తికొండ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు నూతనంగా ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేశారు.

పత్తికొండ అసెంబ్లీ కో-కన్వీనర్ గోవర్ధన్ నాయుడు, మండల అధ్యక్షుడు కరణం నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా ఉప్పర రవీంద్ర కుమార్ (రవి), కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా కరణం శ్రీరాములు, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడిగా హరీష్ నాయక్‌ను నియమించారు.

ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లడంలో కృషి చేస్తామని తెలిపారు. మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

ప్రతి గ్రామంలో పార్టీ కార్యకర్తలను చైతన్యపరచి, యువత, రైతులు, వివిధ సామాజిక వర్గాలను పార్టీ వైపు ఆకర్షించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దండి మల్లికార్జున, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు పూనా మల్లికార్జున, అధికార ప్రతినిధి బ్రహ్మయ్య, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు సీసీ రంగన్న, మండల ప్రధాన కార్యదర్శి మాలేఖరి వీరేష్, తుగ్గలి మండల అధ్యక్షుడు లక్ష్మన్న, మద్దికేర మండల అధ్యక్షుడు శంకర్ బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు రామ్మోహన్, శంకరయ్య చారి తదితరులు పాల్గొన్నారు.నూతన అధ్యక్షులకు పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలియజేశారు.