పదో తరగతి పరీక్షలకు కర్నూలు జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత

– పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు– మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా పోలీసుల ప్రత్యేక చర్యలు– జిరాక్స్ సెంటర్లు మూసివేత, స్ట్రాంగ్ రూమ్‌లకు పటిష్ట భద్రత– అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలి కర్నూలు, మార్చి 14 (స్ఫూర్తి పత్రిక): ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా మరియు సజావుగా జరిగేలా పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 1వ...