పదో తరగతి పరీక్షలకు శ్రీకారం… ప్రశాంతంగా మొదటి రోజు
– మండలంలో మూడు కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ– 666 మందిలో 656 మంది హాజరు– 10 మంది విద్యార్థులు గైర్హాజరు హోళగుంద, మార్చి 16 (స్ఫూర్తి పత్రిక): మండల పరిధిలో పదో తరగతి వార్షిక పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పరీక్షల తొలి రోజు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడింది. విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకుని పరీక్షలకు సిద్ధమయ్యారు. పరీక్షా నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకోవడంతో పాటు...