పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సభ

– ఎఫ్‌ఆర్ హై స్కూల్లో నిర్వహణ– పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని సూచనలు– విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య కీలకం అన్న నిర్వాహకులు– ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఉపాధ్యాయుల ఆకాంక్ష దేవనకొండ, మార్చి 13 (స్ఫూర్తి పత్రిక): దేవనకొండ మండల కేంద్రంలోని ఎఫ్‌ఆర్ హై స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ఉపాధ్యాయుడు బి. ఉచ్చీరప్ప...