ఆదోని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న ఉద్యమానికి బుడగ జంగాలీలు మద్దతు ప్రకటించారు. సోమవారం అలూరు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 46వ రోజు రిలే దీక్షల్లో బుడగ జంగాల సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొని నిరసన తెలిపారు.సంప్రదాయ వాయిద్యాలు, పద్యాలు, బుర్రకథల రూపంలో ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఆదోని జిల్లాగా ప్రకటించాలంటూ నినాదాలు చేశారు. వెనుకబడిన అలూరు నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి చెందాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించడమే ఏకైక మార్గమని వారు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా బుడగ జంగాల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు సిరివటి మహేంద్రకుమార్ మాట్లాడుతూ, ఆదోని జిల్లా సాధన కోసం అన్ని వర్గాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ దీక్షల్లో కుమార్, చిన్న రంగన్న, చిన్న, ఈరన్న, మహేష్, పెద్ద ఈరన్న, కషన్న, మోషమ్మ, మల్లేష్, నాగప్ప, మోతి, బద్రి, మారెప్ప, మోతిగజలప్ప పాల్గొన్నారు.దీక్షలకు అలూరు జేఏసీ నాయకులు కత్తి రామాంజినేయులు, భూపేష్, ఎల్లప్ప, చంద్రకాంత్ రెడ్డి, దాపల గోపాల్, పూల రామాంజనేయులు, అలాగే మాజీ సైనికులు మహేష్, వేమిరెడ్డి మద్దతు ప్రకటించారు. ఆదోనిని జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని వారు స్పష్టం చేశారు.
పద్యాలు, బుర్రకథలతో ఆదోని జిల్లా సాధన ఉద్యమం
0
29
Previous article
Next article

