పద్యాలు, బుర్రకథలతో ఆదోని జిల్లా సాధన ఉద్యమం

ఆదోని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న ఉద్యమానికి బుడగ జంగాలీలు మద్దతు ప్రకటించారు. సోమవారం అలూరు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 46వ రోజు రిలే దీక్షల్లో బుడగ జంగాల సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొని నిరసన తెలిపారు.సంప్రదాయ వాయిద్యాలు, పద్యాలు, బుర్రకథల రూపంలో ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఆదోని జిల్లాగా ప్రకటించాలంటూ నినాదాలు చేశారు. వెనుకబడిన అలూరు నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి చెందాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించడమే ఏకైక మార్గమని వారు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా బుడగ జంగాల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు సిరివటి...