📄 ePaper
Wednesday, March 18, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్పాత ఉపాధి హామీ విధానమే కొనసాగాలి: CPI–CPM డిమాండ్

పాత ఉపాధి హామీ విధానమే కొనసాగాలి: CPI–CPM డిమాండ్

📰 Generate e-Paper Clip

  • గాంధీ వర్ధంతి రోజున ఎర్రజెండాల నిరసన
  • కనీస వేతనం రూ.600, 200 పని దినాలు ఇవ్వాలి

దేవనకొండ, జనవరి 30 (స్ఫూర్తి పత్రిక):
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని, నూతనంగా తీసుకొచ్చిన వి.బి.జి. రాంజీ (VBGRY) పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఐ, సీపీఎం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం దేవనకొండ మండల కేంద్రంలో సీపీఐ, సీపీఎం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం (BKMU) ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి సామూహిక నిరసన దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కూలీలు, రైతులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. మద్దిలేటి శెట్టి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి. వీరశేఖర్, సీపీఐ మండల కార్యదర్శి ఎం. నరసరావు మాట్లాడుతూ – కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి కూలీలకు నష్టం కలిగించే విధానాలను అమలు చేస్తోందని తీవ్రంగా విమర్శించారు.దేశ సంపదను సంపన్న వర్గాలకు దోచిపెట్టే విధానంలో భాగంగానే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సమూల మార్పులు తీసుకువచ్చారని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే వి.బి.జి. రాంజీ వంటి కొత్త పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.తక్షణమే VBGRY పథకాన్ని రద్దు చేసి, ఉపాధి కూలీలకు కనీస వేతనం

 రూ.600, ఏటా 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించకుండా, రాష్ట్ర ప్రభుత్వం వాటినే అమలు చేయడం సరికాదని హెచ్చరించారు.అలాగే రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ వైద్య విద్యను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కృష్ణ, మండల కార్యదర్శి జె. హరికృష్ణ, మండల ఉపాధ్యక్షులు యూసుఫ్ భాష, మండల నాయకులు అశోక్, నాగేంద్ర, పాండు, మహేంద్ర, బజారి, రంగన్న, ఎర్రిస్వామి, ఈరన్న, సుబ్బయ్య, వీరాంజి, భాస్కర్, రవి, రాజశేఖర్, శ్రీనివాసులు, రామాంజనేయులు, రఫీ, అనుమప్ప, మద్దిలేటి, మహాదేవ, మహేష్, హనుమంతు, రాము, రహిమాన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!