పేదరికాన్ని జయించి గోల్డ్ మెడల్ సాధించిన దేవనకొండ యువకుడు

కష్టాలను జయించి విజయం సాధించిన ఈరప్ప యోగివేమన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఘనతరంగస్థల కళల్లో ప్రతిభకు బంగారు పతకం దేవనకొండ, మార్చి 13 (స్ఫూర్తి పత్రిక): కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు జీవితంలో ఎన్నో ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని సాధించవచ్చని దేవనకొండకు చెందిన భైరవపోవు ఈరప్ప నిరూపించారు. సాధారణ కుటుంబంలో పుట్టి పేదరికంలో పెరిగినా చదువుపై ఉన్న ఆసక్తి, కృషి మరియు పట్టుదలతో యోగివేమన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గోల్డ్ మెడల్ సాధించి దేవనకొండకు గర్వకారణంగా నిలిచారు. కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో...