ప్రజా ఫిర్యాదులకు చట్టపరంగా న్యాయం చేస్తాం: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

– ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 102 వినతులు స్వీకరణ– బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ఎస్పీ– త్వరితగతిన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశం కర్నూలు, మార్చి 16 (స్ఫూర్తి పత్రిక): జిల్లా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు కొత్తపేటలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన...