సమ్మె విజయవంతం కోసం దేవనకొండలో బైక్ ర్యాలీ.
దేవనకొండ,ఫిబ్రవరి,(స్పూర్తి పత్రిక) కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ లేబర్ కోడ్ల రద్దు కోసం ఫిబ్రవరి 12 న కేంద్ర కార్మిక సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెలో భాగంగా దేవనకొండ మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ ఎఐటియుసి జిల్లా నాయకులు నరసరావులు మాట్లాడుతూ ..బ్రిటీష్ కాలంలో అనేక పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాల స్థానంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు మార్చింది. కార్మిక, రైతు హక్కులను కాలరాస్తోందన్నారు. నాలుగు లేబర్ కోడ్ల అమలు ద్వారా దేశంలో కార్మిక వర్గానికి రావాల్సిన అనేక మౌలిక సదుపాయాలు, కనీస వేతనాలు, యూనియన్ రిజిస్ట్రేషన్లు అందే పరిస్థితి లేదన్నారు. కార్మికులు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయే ప్రమాదకర చట్టాలను ఈ ప్రభుత్వం తీసుకొస్తుందని, మాట్లాడే స్వేచ్ఛను హరిస్తోందన్నారు. వీటిని తిప్పి కొట్టేందుకే కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలు నిర్వహించాలని కోరారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాదిమంది కార్మికులకు రావాల్సిన సంక్షేమ బోర్డు నిధులు ఇంతవరకు అందలేదని విమర్శించారు. స్కీమ్ వర్కర్లు అయిన ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కనీస వేతనo ఇవ్వాలి. కనేత వేతన చట్టం అమలు చేయాలి. మోదీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందన్నారు. ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచింది. ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. ఈ తరుణంలో కోట్లాది మంది కార్మికులు ఫిబ్రవరి 12 న చేపట్టే సార్వత్రిక సమ్మెలో కార్మికులందరు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక , వ్యవసాయ కార్మిక, యువజన, విద్యార్థి సంఘాల నాయకులు యూసుఫ్, నాగేష్,నాగేంద్ర, రాజశేఖర్ కృష్ణ, నరేష్,రవి,భాస్కర్, వీరంజి,కోదండ,బాషా, రామంజి,నాగరాజు,రంగడు, కాంతయ్య,రాము, సోమశేఖర్,రాజు,సుధాకర్, కుమార్, చిన్న రాయుడు తదితరులు పాల్గొన్నారు.
