📄 ePaper
Wednesday, March 18, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్బళ్లారి జిల్లా జర్నలిస్టు సంఘం అధ్యక్షుడిగా ఎర్రగుడి రమేష్

బళ్లారి జిల్లా జర్నలిస్టు సంఘం అధ్యక్షుడిగా ఎర్రగుడి రమేష్

📰 Generate e-Paper Clip

– ఆలూరు ఏపీడబ్ల్యూజే నాయకుల హాజరు
– జర్నలిస్టుల ఐక్యతకు పిలుపు

ఆలూరు , మార్చి 09 (స్ఫూర్తి పత్రిక):

కర్ణాటక రాష్ట్ర జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో బళ్లారి జిల్లా జర్నలిస్టు సంఘం అధ్యక్షుడిగా ఎర్రగుడి రమేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బళ్లారి జిల్లా కేంద్రంలో నిర్వహించిన పదగ్రహణ కార్యక్రమం ఘనంగా జరిగింది.నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎర్రగుడి రమేష్‌కు పలువురు జర్నలిస్టులు అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల ఐక్యతతో మీడియా రంగం మరింత బలపడుతుందని ఈ సందర్భంగా పలువురు నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందడంతో ఆలూరు ఏపీడబ్ల్యూజే మండల కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఆలూరు మండల అధ్యక్షుడు వాల్మీకి గోపాల్ నాయుడు, మండల ఉపాధ్యక్షుడు గుత్తి నాగరాజు, తాలూకా ప్రధాన కార్యదర్శి సాక్షి చంద్రబాబు మరియు ఏపీడబ్ల్యూజే ఆలూరు మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బి.ఆర్.కె రంగస్వామి, విశాలాంధ్ర చిన్న, కందనవోలు రామమోహన్, దేశపోరాటం నారాయణస్వామి, ప్రతినిత్యం ఎర్రిస్వామి, విశ్వవార్త వీరేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.జర్నలిస్టులు సమాజంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని, మీడియా బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!