బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలి… చదువు ద్వారానే మహిళా సాధికారత
- హొళగుందలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు - బాల్యంలో పెళ్లిళ్లు ఆపాలని అధికారుల పిలుపు - మహిళలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం - ఆటల పోటీలతో మహిళల్లో ఉత్సాహం హొళగుంద, మార్చి 09 (స్ఫూర్తి పత్రిక): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హొళగుంద మండలంలో ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల సాధికారత, బాల్య వివాహాల నిర్మూలన మరియు సమానత్వంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో విజయలలిత మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో...