కర్నూలు: భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) కర్నూలు జిల్లా కన్వీనర్‌గా ఎల్లార్తి వాల్మీకి అర్జునను నియమించారు. పార్టీ సిద్ధాంతాల పట్ల ఆయనకున్న నిబద్ధత, క్షేత్రస్థాయిలో ప్రజలతో, ముఖ్యంగా వాల్మీకి సామాజిక వర్గంతో ఆయనకున్న సత్సంబంధాలను గుర్తించిన బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఈ కీలక బాధ్యతను అప్పగించారు.
ఈ నియామకం పట్ల వాల్మీకి అర్జున సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా కన్వీనర్‌గా తనకు బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధినేత రామచంద్రయాదవ్ కు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అధినేత తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కర్నూలు జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. జిల్లాలోని రైతులు, బడుగు బలహీన వర్గాల సమస్యలపై పోరాడుతూ, పార్టీని ప్రజలకు మరింత చేరువ చేస్తానని ఆయన పేర్కొన్నారు.


