బీసీల హక్కుల సాధనకే పోరాటం… ప్రభుత్వానికి బీసీవై పార్టీ గడువు
ఐదు డిమాండ్లపై తక్షణ చర్యల డిమాండ్ మార్చి 31లోగా స్పందించకపోతే నిరాహార దీక్ష హెచ్చరిక హోళగుంద, మార్చి 23 (స్ఫూర్తి పత్రిక): వెనుకబడిన తరగతుల హక్కుల సాధన లక్ష్యంగా బీసీవై పార్టీ తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి సంబంధించిన ప్రధాన అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ జిల్లా అధ్యక్షుడు అర్జున్ వాల్మీకి ఆధ్వర్యంలో నాయకులు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీలు గత ఎన్నో...