భగత్‌సింగ్ స్ఫూర్తితో అన్యాయాలపై పోరాటం అవసరం

యువత చైతన్యవంతంగా ముందుకు రావాలని పిలుపు అమరులకు ఘన నివాళులు అర్పించిన నాయకులు దేవనకొండ, మార్చి 23 (స్ఫూర్తి పత్రిక): అమర వీరులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల వర్ధంతి సందర్భంగా దేవనకొండ మండలంలో పలు ప్రాంతాల్లో నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు కోటకొండ, తెర్నేకల్, కుంకునూరు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో నాయకులు పాల్గొని అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు వై. మహేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా...