sphoortipatrika.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 3:15 pm Digital Edition : SPHOORTI PATRIKA

భూగర్భ జలాల సంరక్షణకు భారీ ఉద్యమం… ఆలూరులో ‘జలధార’కు ఘన శ్రీకారం

  • 100 రోజుల జల సంరక్షణ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా శ్రీకారం
  • ఆలూరు చెరువు కట్ట వద్ద ఉత్సాహంగా ప్రారంభోత్సవం
  • వైకుంఠం జ్యోతి నేతృత్వంలో కార్యాచరణకు వేగం
  • భవిష్యత్ తరాలకు నీటి భద్రత లక్ష్యంగా పిలుపు

ఆలూరు, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక):

రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జలధార” కార్యక్రమం ఆలూరు నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైంది. ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు 100 రోజులపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి ఆలూరు చెరువు కట్ట వద్ద శుభారంభం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఆలూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి సమన్వయంతో నిర్వహించగా, టిడిపి రాష్ట్ర నాయకులు వైకుంఠం శివప్రసాద్ మార్గదర్శకత్వంలో ఏర్పాట్లు జరిగాయి. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.జల వనరుల పరిరక్షణ ప్రాధాన్యతను ఈ సందర్భంగా నాయకులు ప్రస్తావిస్తూ, భూగర్భ జలాల నిల్వ పెంపు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. చెరువులు, కుంటలు, కాలువల పునరుద్ధరణతో పాటు వర్షపు నీటిని నిల్వ చేసే చర్యలు తీసుకుంటే భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించవచ్చని తెలిపారు.ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, ఆలూరు నియోజకవర్గంలో జల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తామని వెల్లడించినట్లు సమాచారం. ప్రతి గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో నీటి వనరులను కాపాడే దిశగా చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఏబీసీ కెనాల్ చైర్మన్ కృష్ణప్ప, వైస్ చైర్మన్ మీశాల రామాంజినేయులు, కన్వీనర్ శీనప్ప, డీఈ చంద్రశేఖర్, అగ్రహారం చైర్మన్ ధర్మప్ప, టీడీపీ యువ నాయకుడు వాల్మీకి గోపాల్, జేఈ ఆంజనేయులు, దేగులపాడు చంద్ర, నరసప్ప, కిట్టు, కొమురాజు, రామచంద్ర, హరి తదితరులు పాల్గొన్నారు.