మహిళ మారితే కుటుంబం మారుతుంది… సమాజం మారుతుంది

మహిళా దినోత్సవం సందర్భంగా కవయిత్రి మంజుల పత్తిపాటి ఆవేదన సాటి మహిళ మారితేనే నిజమైన మహిళా సాధికారత మహిళలకు మహిళలే అడ్డంకిగా మారుతున్న పరిస్థితులపై వ్యాఖ్య ఆలేరు, మార్చి 08 (స్ఫూర్తి పత్రిక): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, కవయిత్రి మంజుల పత్తిపాటి మహిళల పరిస్థితిపై స్పందించారు. మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నప్పటికీ ప్రతి మహిళ నిజంగా సంతోషంగా ఉందా అనే విషయాన్ని సమాజం ఆలోచించాలని ఆమె పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో మహిళలకు మహిళలే శత్రువులుగా...