మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికైన అనుభవజ్ఞుడైన నాయకుడు అమరావతి, మార్చి 09 (స్ఫూర్తి పత్రిక): మాజీ కేంద్ర మంత్రి, అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు కావూరి సాంబశివరావు (82) కన్నుమూశారు. ఆయన మరణవార్త రాజకీయ వర్గాల్లో విషాదాన్ని నింపింది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.కావూరి సాంబశివరావు లోక్‌సభకు ఐదుసార్లు ఎన్నికై ప్రజాప్రతినిధిగా సేవలందించారు. 1984, 1989, 1998 సంవత్సరాల్లో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. అనంతరం 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి...