మొలగవల్లిలో మారెమ్మ దేవాలయ స్లాబ్ నిర్మాణం పూర్తి… దాతల సేవలకు ఘన సత్కారం
- రూ.5 లక్షలతో దేవాలయ స్లాబ్ నిర్మాణం - నూతన విగ్రహాలతో పునర్నిర్మాణం - గ్రామ పెద్దలు, కమిటీ సభ్యుల అభినందనలు - ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమం ఆలూరు, ఏప్రిల్ 12 (స్ఫూర్తి పత్రిక): కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో శ్రీ శ్రీ మారెమ్మ దేవాలయ పునర్నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో దేవాలయ స్లాబ్ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేయడం గ్రామస్థుల్లో ఆనందాన్ని నింపింది. పురాతన కాలం నుండి గ్రామంలో ఉన్న ఈ దేవాలయం కాలక్రమేణా దెబ్బతిని విగ్రహాలు విచ్ఛిన్నం...