- వరిముక్కల గ్రామానికి గర్వకారణం
- గ్రామీణ యువతికి ఘన విజయం
- డిప్యూటీ తహశీల్దారుగా లావణ్య యాదవ్ ఎంపిక
దేవనకొండ మండలం వరిముక్కల గ్రామానికి చెందిన లావణ్య యాదవ్ గ్రూప్–2 పరీక్షల్లో ప్రతిభ చాటి డిప్యూటీ తహశీల్దార్గా ఎంపికయ్యారు. గ్రామీణ నేపథ్యాన్ని అధిగమించి ఉన్నత ప్రభుత్వ సేవలో స్థానం సంపాదించుకోవడం ఆమె పట్టుదలకి నిదర్శనంగా నిలిచింది.మురళి యాదవ్, భారతి దంపతుల కుమార్తె అయిన లావణ్య యాదవ్ కష్టపడి చదివి ఈ విజయాన్ని సాధించారు.
నిరంతర శ్రమ, క్రమశిక్షణతో ముందుకు సాగితే లక్ష్యం తప్పకుండా చేరుకోవచ్చని ఆమె మరోసారి నిరూపించారు.ఈ విజయం వరిముక్కల గ్రామానికే కాదు, దేవనకొండ మండలానికి గర్వకారణంగా మారింది. గ్రామస్తులు, శ్రేయోభిలాషులు లావణ్య యాదవ్‌ను ఘనంగా అభినందిస్తూ, ఆమె భవిష్యత్‌లో ప్రజలకు అంకితభావంతో సేవలు అందించాలని ఆకాంక్షించారు.లావణ్య యాదవ్ విజయం నేటి యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువతులకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.