– సర్పంచ్ కురువ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ఏర్పాట్లు
– హజరత్ షేక్షావలి, షాషావలి దర్గా వద్ద కార్యక్రమం
– ముస్లిం సోదరులతో ఐక్యత సందేశం
– సామరస్యానికి నిదర్శనంగా ఇఫ్తార్ విందు
హోళగుంద, మార్చి 14 (స్ఫూర్తి పత్రిక):
హోళగుంద మండల పరిధిలోని ఎల్లార్తి గ్రామంలో రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కురువ చాముండేశ్వరి ఆధ్వర్యంలో హజరత్ షేక్షావలి, హజరత్ షాషావలి దర్గా సన్నిధానంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటిస్తున్న ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి వారికి ఆతిథ్యం అందించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ రంజాన్ మాసం ఆధ్యాత్మికత, క్రమశిక్షణ మరియు సహనానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం నెలకొనాలని ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు పాటిస్తూ ప్రార్థనలు చేస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కె. గిరి మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పాటించే ఉపవాస దీక్షలు సమాజ శ్రేయస్సు కోసం అని పేర్కొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాలు మత సామరస్యాన్ని పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గ్రామస్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఇఫ్తార్ విందును విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో దరగప్ప, దాదావలి, రవి, షేక్షావలి, మెహబూబ్, జవీద్ మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.