రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జెండా ఆవిష్కరణతో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు మార్చ్‌పాస్ట్‌తో విద్యార్థుల్లో దేశభక్తి ఉత్సాహం రాజ్యాంగ విలువలను విద్యార్థులకు వివరించిన ముఖ్య అతిథులు సాంస్కృతిక కార్యక్రమాలతో కళకళలాడిన పాఠశాల ప్రాంగణం దేవనకొండ మండల కేంద్రంలోని రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. జాతీయ పండుగను పురస్కరించుకుని పాఠశాల ప్రాంగణం దేశభక్తి నినాదాలు, జాతీయ గీతాలతో మార్మోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెలుగు సీసీ నరసన్న, పాఠశాల చైర్మన్ నాగరాజు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు....