వాల్మీకి గుడి పరిసరాల్లో శుభ్రత కార్యక్రమం
పంచాయతీ అధికారుల తక్షణ చర్య అధికారులకు వాల్మీకి నాయకుల కృతజ్ఞతలు దేవనకొండ, మార్చి 08 (స్ఫూర్తి పత్రిక): దేవనకొండ మండల కేంద్రంలోని వాల్మీకి గుడి పరిసర ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను పంచాయతీ అధికారులు శుభ్రపరిచారు. గుడి చుట్టూ కొంతకాలంగా చెత్త పేరుకుపోవడంతో స్థానిక భక్తులు మరియు గ్రామస్థులకు అసౌకర్యం కలుగుతున్నట్లు వాల్మీకి నాయకులు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని పంచాయతీ సర్పంచ్ రంగలక్ష్మి మరియు పంచాయతీ కార్యదర్శి రాముడు వద్ద వాల్మీకి నాయకులు వివరించగా వారు సానుకూలంగా స్పందించారు. వెంటనే పంచాయతీ...