విద్యార్థి సంఘ నేతలను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీ పై చర్యలు తీసుకోవాలి…

దేవనకొండ లో విద్యార్థి, యువజన సంఘాల నాయకుల డిమాండ్. దేవనకొండ, ఫిబ్రవరి 4( స్ఫూర్తిపత్రిక ): అధిక ఫీజుల వసూళ్లను అరికట్టాలని, యూనివర్సిటీలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని తిరుపతి కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాల నేతలను మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు కిడ్నాప్ చేసి దాడి చేయడం అమానుషమని ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి కె.భాస్కర్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు మహేంద్ర, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎం. రామాంజనేయులు లు తీవ్రంగా ఖండించారు. బుధవారం స్థానిక హమాలీ వర్కర్స్...