వివాహం జీవితానికి కొత్త ఆరంభం… అరికేరలో పెళ్లి వేడుకల్లో పాల్గొన్న సురేందర్ రెడ్డి

నూతన దంపతులకు ఆశీర్వాదాలు కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఆలూరు, మార్చి 22 (స్ఫూర్తి పత్రిక): ఆలూరు నియోజకవర్గంలోని అరికేర గ్రామంలో నిర్వహించిన వివాహ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి హాజరయ్యారు. మండల పార్టీ నాయకుడు వీరేష్ సోదరుని వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వివాహం అనేది ప్రేమ, పరస్పర విశ్వాసంతో ప్రారంభమయ్యే జీవితంలోని ముఖ్యమైన ఘట్టమని పేర్కొన్నారు. నూతన దంపతులు కలకాలం సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.అనంతరం గ్రామంలోని...