వేదవతి, నగుడోనా పనులు వెంటనే ప్రారంభించాలి: సీపీఐ(ఎం.ఎల్) లిబరేషన్

తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన పార్టీ శ్రేణులు వేదవతి ప్రాజెక్టు, నగుడోనా రిజర్వాయర్ పనులపై డిమాండ్ వెనుకబాటుతనంపై ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు రైతుల సమస్యలు, వలసలపై ఆందోళన వ్యక్తీకరణ ఆలూరు, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): ఆలూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం పెండింగ్‌లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పిస్తూ ప్రాంతీయ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ...