వేదావతి ప్రాజెక్టు ఆలస్యం ఇక చాలు… పనులకు గడువు ప్రకటించాలి: కాంగ్రెస్ డిమాండ్
సాగునీటి ఆశలతో ఎదురుచూస్తున్న వేల ఎకరాలు ప్రాజెక్టు జాప్యంపై కాంగ్రెస్ నాయకుల ఆందోళన రైతుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం తక్షణ సమీక్షతో పనులు వేగవంతం చేయాలని డిమాండ్ ఆలూరు, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): ఆలూరు మండలం సహా పరిసర ప్రాంతాల వ్యవసాయాభివృద్ధికి కీలకంగా భావిస్తున్న వేదావతి ప్రాజెక్టు అమలులో కొనసాగుతున్న జాప్యంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆర్ & బి అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.ఈ...