వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో దేవరగట్టు అభివృద్ధికి శ్రీకారం

– భక్తుల సౌకర్యార్థం కోటి రూపాయల సీసీ రోడ్డు పనులు ప్రారంభం– దేవరగట్టు ఆలయ మార్గంలో మౌలిక వసతుల మెరుగుదల– అభివృద్ధి చర్యలపై భక్తులు, ప్రజల హర్షం హోళగుంద, మార్చి 16 (స్ఫూర్తి పత్రిక): మండల పరిధిలో ప్రసిద్ధిగాంచిన దేవరగట్టు శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. భక్తుల రాకపోకలకు సౌకర్యంగా ఉండేలా ఈ పనులు చేపట్టినట్లు స్థానిక నాయకులు తెలిపారు. దేవరగట్టు ఆలయానికి వచ్చే మార్గంలో సుమారు రూ.1 కోటి...