వైకుంఠం జ్యోతి చొరవతో చరిత్రాత్మక ముందడుగు… హోళగుంద–డనాపురం రోడ్డు పనులకు శ్రీకారం
నియోజకవర్గ అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన నాయకత్వం రూ.13.70 కోట్లతో కీలక రహదారి పనుల ప్రారంభం సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికిన ప్రాజెక్ట్ కూటమి ప్రభుత్వంలో వేగం పుంజుకున్న మౌలిక సదుపాయాలు హోళగుంద, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి దిశగా కీలక ముందడుగు పడింది. హోళగుంద నుంచి డనాపురం వరకు ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న రహదారి నిర్మాణ పనులు ప్రారంభమవడంతో మండల ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి ఆలూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి తీసుకున్న ప్రత్యేక...