📄 ePaper
Wednesday, March 18, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్సంఘ సేవకు గుర్తింపు… శ్రీనాథ్ గుప్తాకు ‘క్రాంతి పురస్కార్’

సంఘ సేవకు గుర్తింపు… శ్రీనాథ్ గుప్తాకు ‘క్రాంతి పురస్కార్’

📰 Generate e-Paper Clip

– హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డు ప్రదానం
– సామాజిక సేవలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ఎంపిక
– వైద్య శిబిరాల ద్వారా సేవలందించిన సేవకర్తకు సత్కారం
– మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా అవార్డు ప్రదానం

ఆదోని, మార్చి 09 (స్ఫూర్తి పత్రిక):

ఆదోని పట్టణానికి చెందిన సంఘ సేవకర్త వంకదారు శ్రీనాథ్ గుప్తాకు తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో “క్రాంతి పురస్కార్” అవార్డు ప్రదానం చేశారు. తెలంగాణ ప్రభుత్వం భాషా మరియు సాంస్కృతిక శాఖతో పాటు పలు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవం మరియు ఉగాది పురస్కారాల కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డు అందించారు.పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన ప్రముఖులు పాల్గొని శ్రీనాథ్ గుప్తాను శాలువాతో సత్కరించి అవార్డును అందజేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చూపుతున్న చొరవను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.గత కొన్ని సంవత్సరాలుగా శ్రీనాథ్ గుప్తా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి సేవలందిస్తున్నారు. ముఖ్యంగా ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాలు, వాస్కులర్ చికిత్సా శిబిరాలు, డెంటల్ క్యాంపులు, ఆయుర్వేద చికిత్సా శిబిరాలు, ఉచిత ఫెర్టిలిటీ క్యాంపులు వంటి పలు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు ప్రముఖ ఎన్నారై కాకుబాల్ నగేష్ సహకారంతో పాటు స్థానిక దాతల సహాయంతో నిర్వహించినట్లు చెప్పారు.అవోపా, వాసవి క్లబ్, ఐఐఎఫ్, ఐవిఎఫ్ వికాస తరంగిణి వంటి సంస్థల సహకారంతో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం తమను క్రాంతి పురస్కార్ అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉందని శ్రీనాథ్ గుప్తా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు, సామాజిక సేవకులు మరియు వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక మహిళా నాయకులు మరియు సేవా సంస్థల సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డు గ్రహీతకు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!