- అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉద్రిక్త వాతావరణం
- కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం
- హేయ వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్
ఆలూరు, ఫిబ్రవరి 1 (స్ఫూర్తి పత్రిక):
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు నిరసనగా ఆలూరు అంబేద్కర్ సర్కిల్‌లో టీడీపీ శ్రేణులు భారీ ఆందోళనకు దిగాయి. టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇంచార్జి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ ఆందోళన కారణంగా ఆలూరు పట్టణంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఇలాంటి వ్యాఖ్యలు హేయమైనవని తీవ్రంగా ఖండించారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలకు పాల్పడిన అంబటి రాంబాబు తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ, టీడీపీ సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని హెచ్చరించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

